Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన ఎమ్మెల్యే డి.సుధీర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
హైదరాబాద్‌లో ని వనస్థలిపురంలో డీమార్ట్ ఎదురుగా అత్యాధునిక సౌకర్యాలు, రోబో స్టీవర్ట్ సేవలతో ఏర్పాటు చేసిన హోటల్ ఎమ్ గ్రాండ్‌ను ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆదివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మన్సూరాబాద్ కార్పొరేటర్ కొప్పుల నర్సింహారెడ్డి, నాగోల్ కార్పొరేటర్ చింతల అరుణా సురేందర్‌యాదవ్, హయత్‌నగర్ కార్పొరేటర్ కళ్లెం నవజీవన్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. హోటల్ ఎమ్ గ్రాండ్ మేనేజింగ్ డైరెక్టర్ గుడిపాటి జగదీశ్ మాట్లాడుతూ..ఎల్బీనగర్ ప్రాంతంలో అత్యంత రోబో సేవలతో కూడిన మొట్టమొదటి హోటల్ తమదేనన్నారు. కరోనా మహమ్మారి వల్ల ఒకరినొకరు కలిసే పరిస్థితి లేదనీ, ఈ నేపథ్యంలోనే కాంటాక్ట్ లెస్ సర్వీసెస్, కాంటాక్ట్ లెస్ డైవింగ్ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. తమ హోటల్‌కు వచ్చేవారికి రోబోల ద్వారా సేవలు అందించనున్నట్టు చెప్పారు. తమ హోటల్లో రెస్టారెంట్, బాంకెట్ హాల్స్, ఔట్‌డోర్ క్యాటరింగ్ సర్వీస్, లగ్జరీ రూములు అందుబాటులో ఉన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో హోటల్ ఎమ్ గ్రాండ్ డైరెక్టర్లు శ్రీధర్, పాండుయాదవ్, సాయికుమార్, రణవీర్ పాల్గొన్నారు.