Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దేశంలో నిరుద్యోగ రేటు 8 శాతం : ఎమ్మెల్సీ కవిత
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
'కేంద్రంలో మీ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఎనిమిదేండ్లు కావస్తున్నది. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలన్నరు. ఆ లెక్కన 16 కోట్ల ఉద్యోగాలివ్వాలి. ఇప్పటిదాకా ఎన్ని ఇచ్చారో చెప్పండి' అని అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మను ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఈ మేరకు ఆదివారం ఆమె ఒక ప్రకటన విడుదల చేశారు. 'బిస్వా శర్మ గారు ఇంతకుముందు మీ ఉపన్యాసం చూశాను. తెలంగాణ యొక్క గొప్ప సంస్కతి సంప్రదాయాలను తుడిచిపెట్టడానికి బీజేపీ ఇంతగా ఎందుకు ప్రయత్నిస్తుందో అర్థం అవడం లేదు' అని పేర్కొన్నారు. 2014 నుంచి ఇప్పటివరకూ ప్రజలు టీఆర్ఎస్ పక్షానే ఉన్నారనీ, 2018 ఎన్నికల్లో ఇలాగే విర్రవీగుతూ మాట్లాడిన మీ పార్టీ నేతలకు తెలంగాణ ప్రజలు కర్ర కాల్చి వాత పెట్టి, 107 స్థానాల్లో డిపాజిట్ లేకుండా చేశారని విమర్శించారు. తెలంగాణలో ఈ ఏడేండ్లలో లక్షా 30 వేల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని తెలిపారు. హైదరాబాద్ కేంద్రంగా లక్షలాది ప్రయి వేటు ఉద్యోగాలు కల్పించి దేశంలోనే అగ్రస్థా నంలో నిలిచింద ని పేర్కొ న్నారు. సెంటర్ ఫర్ మానిటరింగ్ ఇండి యన్ ఎకా నమీ (సీఎంఐఈ) సంస్థ ప్రకారం, భార త్లో నిరుద్యోగిత రేటు డిసెంబర్లో దాదాపు 8 శాతానికి పెరిగిందనీ, బంగ్లాదేశ్ (5.3శాతం), మెక్సికో (4.7శాతం), వియత్నాం (2.3శాతం) లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాల కంటే భారత్లో ఈ నిరుద్యోగ రేటు ఎక్కువ ఉందని వివరించారు. సీఎం కేసీఆర్ తీసుకొచ్చిన పథకాలను కేంద్ర ప్రభుత్వం కాపీ కొట్టుకుంటున్నదని విమర్శించారు. రాష్ట్రంలోని పథకాలను ఢిల్లీలో పొగుడుతూ..ఇక్కడకొచ్చి వ్యతిరేకంగా మాట్లాడటంపై బీజేపీ నేతల విజ్ఞతకే వదిలేస్తున్నామని పేర్కొన్నారు. రైతుబంధు, కల్యాణలక్ష్మి, మిషన్ భగీరథ పథకాలను వేర్వేరు పేర్లతో బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విషయం బిస్వా శర్మకు తెలియదా? అని ప్రశ్నించారు.