Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-చౌటుప్పల్ రూరల్
సంక్రాంతి పండుగతో ప్రజలు సొంత గ్రామాలకు తరలివెళ్తున్నారు. ఆదివారం తెల్లవారుజాము నుంచే వాహనాలు రాకపోకలు పెరిగాయి. యాదాద్రిభువనగిరి జిల్లా చౌటుప్పల్ పట్టణంలోని జాతీయ రహదారిపై ఉన్న పంతంగి టోల్‌ప్లాజా వద్ద ఆదివారం వాహనాల ట్రాఫిక్ రద్దీ కొనసాగుతుంది. తెలుగురాష్టాల్లో ముఖ్యంగా ఆంధ్రాలో సంక్రాంతి పండుగను అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లో నివాసముంటున్న వారు గ్రామాల బాట పట్టారు. ప్రతిఏడాది సంక్రాంతికి 3,4 రోజులు మాత్రమే సెలవులు వచ్చేవి. కానీ ఈ ఏడాది సుమారు పది రోజులకు పైగా సెలవులు రావడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు పండుగకు ముందుగానే కార్లలో సొంత గ్రామాలకు వెళ్తున్నారు. దాంతో జాతీయరహదారిపై వాహనాల రద్దీ పెరిగింది. ఫాస్ట్ట్రాగ్ వల్ల అంతరాయం లేకుండా వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. టోల్‌ప్లాజా 8 విండోలను ఏర్పాటు చేసి విజయవాడ వైపు వాహనాలను వదులుతున్నారు. ఎలాంటి ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఏర్పాటు చేశారు.