Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
అఖిలభారత కిసాన్‌సభ (ఏఐకేఎస్) జాతీయ కౌన్సిల్ సమావేశాలు సోమవారం నుంచి మూడు రోజులపాటు జరగనున్నాయి. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఉదయం 11 గంటలకు ఏఐకేఎస్ జాతీయ పతాక ఆవిష్కరణతో సమావేశాలు ప్రారంభం కానున్నాయి. కేంద్ర ప్రభుత్వం అవలంభిస్తున్న రైతాంగా వ్యతిరేక విధానాలు, వ్యవసాయ సంక్షోభం తదితర అంశాలపై చర్చించనున్నారు. మూడు వ్యవసాయ చట్టాలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసినప్పటికీ...అత్యంత కీలకమైన కనీస మద్దతు ధరల చట్టం, రుణవిమోచన చట్టం, విద్యుత్ సవరణ బిల్లును ఉపసంహరించడం వంటి డిమాండ్లు సాధించుకోవడానికి తీసుకోవాల్సిన కార్యచరణకు రూపకల్పన చేయనున్నారు. ఇటీవల జరిగిన రైతాంగ పోరాటాలు, ఆందోళనలను సమీక్షించి, భవిష్యత్తు కార్యాచరణను రూపొందించనున్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చాక సరళీకరణ విధానాలను వేగవంతంగా అమలు చేస్తున్న నేపథ్యంలో వాటి ప్రభావం సన్న,చిన్నకారు రైతులపై ఎలా పడుతుందో కులంకుశంగా చర్చించనున్నారు. జాతీయ కౌన్సిల్ సమావేశాల చివరి రోజు ఆన్లైన్ బహిరంగ సభ నిర్వహిస్తామని తెలంగాణ రైతుసంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ తెలిపారు. సమావేశంలో ఏఐకేఎస్ జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్‌ధావలే, హన్నన్ మొల్ల, జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, విజ్జుకృష్ణన్, కృష్ణ ప్రసాద్‌తోపాటు దేశ నలుముల నుంచి రైతాంగం ఉద్యమ నాయకులు హాజరుకానున్నారు.