Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో ప్లాట్ ఫాం టికెట్ ధరను దక్షిణ మధ్య రైల్వే భారీగా పెంచింది. టికెట్ ధరను రూ.10 నుంచి రూ.50 చేసింది. మిగతా స్టేషన్లలో ఈ ధరను రూ.10 నుంచి రూ.20కి పెంచింది. సంక్రాంతి పండుగ వేళ స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు అధికారులు తెలిపారు.