Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వైద్యారోగ్యశాఖ సిబ్బందికీ, ఫ్రంట్ లైన్ వర్కర్లకు సోమవారం నుంచి బూస్టర్ డోసు (మూడో డోసు) ఇవ్వనున్నారు. గతేడాది ఫిబ్రవరిలో రెండో డోసు తీసుకున్న వైద్యారోగ్యశాఖ సిబ్బందికీ, మార్చిలో రెండో డోసు తీసుకున్న ఫ్రంట్ లైన్ వర్కర్లకు ఈ దఫా బూస్టర్ డోసు ఇవ్వనున్నారు. అన్ని వ్యాక్సినేషన్ సెంటర్లలో వీరికి టీకా వేయనున్నట్టు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ ఒక ప్రకటనలో తెలిపింది మూడో డోసుకు అర్హులైన వారి వివరాలు కోవిన్ పోర్టల్లో అందుబాటులో ఉంచారు.