Authorization
Mon April 14, 2025 01:32:20 am
- ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మృతి
- ఒకరు ఆత్మహత్య, మరొకరు గుండెపోటుతో..
నవతెలంగాణ-భీంగల్ / మహబూబాబాద్
వివాదాస్పద 317 జీవోతో ఆదివారం మరో ఇద్దరు మహిళా ఉపాధ్యాయులు మృతి చెందారు. నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికే నలుగురు ఉపాధ్యాయులు మృతిచెందగా.. ఆదివారం మరో ఉపాధ్యాయురాలు ఆత్మహత్య చేసుకున్నది. మహబూబాబాద్ జిల్లాలో గుండెపోటుతో మరో ఉపాధ్యాయురాలు మృతిచెందింది. నిజామాబాద్ జిల్లా భీంగల్ మండలం బాబాపూర్ గ్రామానికి చెందిన బేతాళ సరస్వతి (35) బాబాపూర్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఎస్జీటీగా విధులు నిర్వర్తిస్తోంది. ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన 317 జీవోతో కేటాయింపుల్లో భాగంగా నిజామాబాద్ జిల్లా నుంచి కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలోని మారుమూల గ్రామానికి బదిలీ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. ఆదివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడింది.2012లో మొదటి మొదటి పోస్టింగ్ రహత్ నగర్ తర్వాత బాబాపూర్లో సరస్వతి విధులు నిర్వహిస్తుంది. భర్త భూమేష్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశం కత్తర్ వెళ్ళాడు. మృతురాలికి ఇద్దరు కుమారులున్నారు. కాగా, వివాదాస్పద జీవోతో ఇప్పటి వరకు నలుగురు ఉపాధ్యాయులు బలవన్మరణానికి పాల్పడ్డారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి జీవోను సవరించి స్థానికత, సీనియారిటీ ఆధారంగా కేటాయింపులు చేపట్టాలని కోరుతున్నారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నల్లకుంట గ్రామానికి చెందిన శ్రీమతి (మాధవి).. మహబూబాబాద్ జిల్లా మరిపెడ మండలం ఎడ్జెర్ల గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో విధులు నిర్వర్తిస్తోంది.ఇటీవల విడుదల చేసిన జీవో317తోములుగు జిల్లా ఏటూ రునాగారం మండలం రొయ్యూర్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశా లకు బదిలీ అయింది. ఆర్డర్ వచ్చిన ఒకరోజు వ్యవధిలోనే తీవ్ర మానసిక వేద నతో అస్వస్థతకు గురైన శ్రీమతి గుండెపోటుతో మృతిచెందారు. శ్రీమతి మృతి పట్ల పీఆర్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పులి దేవేందర్ ఆందోళన వెలిబుచ్చారు.11ఏండ్లుగా శ్రీమతి విధులు నిర్వర్తిస్తున్నారని చెప్పా రు.రాష్ట్ర ప్రభుత్వ తప్పుడు విధానాల వల్లే ఉపాధ్యాయురాలు శ్రీమతి హఠాన్మరణం చెందిందని విమర్శించారు. మతురాలి భర్త 108లో ప్రయివేట్ డ్రైవర్గా పని చేస్తున్నారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు.