Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మూగ బధిర చెస్ క్రీడాకారిణి మాలిక హండకు మంత్రి కేటీఆర్ సోమవారం రూ. 15లక్షల ఆర్థిక సహాయంతో పాటు ఒక లాప్‌టాప్‌ను అందించి సన్మానించారు. పంజాబ్‌కి చెందిన మాలిక తన అద్భుతమైన చెస్ నైపుణ్యంతో జాతీయ, అంతర్జాతీయ స్ధాయిలో అనేక పతకాలు గెలిచినా, ఎలాంటి సహకారం అందడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని అమె సామాజిక మాద్యమాల్లో పొస్ట్ చేసిన వీడియో దేశవ్యాప్తంగా సంచలనం సష్టించింది. ఈ క్రమంలో తన వైకల్యాన్ని సవాలు చేస్తూ అంతర్జాతీయ స్థాయిలో అద్భుతమైన క్రీడా నైపుణ్యాన్ని ప్రదర్శించిన మాలికకు సహకారం అందించేందుకు మంత్రి కేటీఆర్ ముందుకొచ్చారు. ఈ మేరకు పంజాబ్ లోని జలంధర్ నుంచి హైదరాబాద్‌కు మాలికను పిలిపించి ఆర్థిక సహాయం చేశారు. మూగ చెవిటి భాషా అనువాదకురాలి సహాయంతో మంత్రి కేటీఆర్ మాలికతో మాట్లాడారు. ఆమెకు అభినందనలు తెలిపారు. మాలికకు మరింత సహాయం అందించాలని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ కు మంత్రి కేటీఆర్ ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.