Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్‌టీటీఎఫ్ అధ్యక్షుడు లక్ష్మణ్‌నాయక్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్టీ ద్వారా ఎంపికైన 169 మంది గిరిజన అభ్యర్థులకు వెంటనే పోస్టింగ్‌లు ఇవ్వాలని టీఎస్‌టీటీఎఫ్ అధ్యక్షుడు ఇస్లావత్ లక్ష్మణ్‌నాయక్ డిమాండ్ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఎస్సీఈఆర్టీ కార్యాలయం వద్ద ఏజెన్సీ గిరిజన, వికలాంగుల అభ్యర్థులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ పోస్టింగ్‌ల కోసం వారు ఎదురుచూస్తున్నారని చెప్పారు. వారితోపాటు ఎంపికైన వారికి పోస్టింగ్‌లు ఇచ్చి రెండేండ్లయిందని వివరించారు. ఏజెన్సీ అభ్యర్థులకు పోస్టింగ్‌లు ఇవ్వాలంటూ హైకోర్టు ఆదేశాలిచ్చి నాలుగు నెలలైనా అధికారులు ఎందుకు జాప్యం చేస్తున్నారని ప్రశ్నించారు.విద్యాశాఖ అధికారులు స్పందించకపోతే సంచాలకుల కార్యాలయం వద్ద నిరాహారదీక్ష చేపట్టడానికి సన్నద్ధమవుతామని హెచ్చరించారు.