Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బోయినపల్లి వినోద్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రైతుల గుండెల్లో ముఖ్యమంత్రి కేసీఆర్ చిరస్థాయిగా నిలిచిపోతారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు.ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన విడు దల చేశారు.రైతులకు పెట్టుబడి సాయాన్ని అందించడమే రైతు బంధు పథకం లక్ష్యమని తలిపారు. ఈ పథకం కింద రూ.50 వేల కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం గొప్ప విషయమనీ, ఈ కార్యక్రమానికి మేధావులతో పాటు అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వస్తున్నదని తెలిపారు. దీనికి తోడు 24గంటలు విద్యుత్ సరఫరా ఉండటంతో పంట దిగుబడి గణనీయంగా పెరిగిందని వినోద్ కుమార్ సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమాన్ని బీజేపీ పాలిత రాష్ట్రాలు అనుకరిం చడం కేసీఆర్‌కు దక్కిన అరుదైన గౌరవమని తెలిపారు. రైతు బీమాతో 70 వేల మందికి ప్రయోజనం చేకూరిందని ఆయన చెప్పారు.
మ్యాప్ అట్లాస్ ఆవిష్కరణ
కేంద్ర ప్రభుత్వ సంస్థ సర్వే ఆఫ్ ఇండియా ఆమోదించిన రాష్ట్రంలోని 33 జిల్లాలతో కూడిన సమగ్ర మ్యాప్ అట్లాస్ ను వినోద్ కుమార్ ఆవిష్కరించారు. సోమవారం హైదరాబాద్‌లోని మంత్రుల నివాస సముదాయంలో విష్ణు మ్యాప్ పబ్లికేషన్స్ సంస్థ ముద్రించిన ఈ మ్యాప్‌ను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలు, అధికార యంత్రాంగానికి ఇది ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు.