Authorization
Sat April 12, 2025 11:16:50 pm
- ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్కుమార్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (ఈఓడీబీ)లో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో ఉందని, ఈ ఒరవడిని ఇదే విధంగా కొనసాగించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్ కోరారు. సోమవారం సచివాలయంలో ప్రజలకు మెరుగైన సేవలు అనే అంశంపై రెవెన్యూ, ఎక్సైజ్, పౌర సరఫరాలు, రవాణా, ఇంధనం, గృహనిర్మాణం, మున్సిపల్, కార్మిక, తదితర 12 విభాగాల అధికారులతో సీఎస్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రభుత్వంలోని 12 శాఖలకు చెందిన 20 హెచ్ఓడీలలో 301 సంస్కరణలు ఈఓడీబీలో భాగంగా అమలవుతున్నాయని తెలిపారు.ఈ ప్రక్రియలను మరింత సరళీకృతం చేసి, వినియోగదారులకు మెరుగైన సేవలు అందిస్తూనే, యూజర్ ఫ్రెండ్లీ, పీపుల్ ఫ్రెండ్లీ విధానాలను రూపొందించాలని సీఎస్ ఆదేశించారు.