Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సంక్రాంతి సెలవులకు వెళ్లేవారి నివాసాలపై నిఘా ఉంచండి : నగర కమిషనర్లు, జిల్లాల ఎస్పీలకు డీజీపీ ఆదేశాలు
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిది
సంక్రాంతి సెలవు దినాలలో ఇండ్లకు తాళం వేసి వెళ్లేవారి నివాసాలపై తగిన నిఘా ఉంచాలని నగర పోలీసు కమిషనర్లు, అన్ని జిల్లాల ఎస్పీలను రాష్ట్ర డీజీపీ మహేందర్ రెడ్డి ఆదేశించారు. పోలీసు గస్తీని పెంచాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం.. ప్రభుత్వ కళాశాలలు, పాఠశాలలకు ఈనెల 8 నుంచి 16 వరకు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జంట నగరాలేగాక వివిధ జిల్లాల నుంచి పౌరులు తమ ఊర్లకు.. ఇండ్లకు తాళాలు వేసి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయా బస్తీలు, కాలనీలలో భద్రతను పెంచాలని డీజీపీ ఆదేశించారు. ముఖ్యంగా, చెడ్డీ గ్యాంగ్‌తో పాటు మహారాష్ట్రకు చెందిన పాల్పార్ది, గావ్పార్ది అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు ఈ పరిస్థితిని అదనుగా చేసుకొని ఇండ్ల తాళాలు పగలగొట్టి దోపిడీలు, దొంగతనాలకు పాల్పడే ప్రమాదమున్నదని ఆయన హెచ్చరించారు. ముఖ్యంగా, దూరంగా విసిరేసినట్టు ఉండే ఇండ్లు, కాలనీలలో నిఘాను పెంచాలన్నారు. రాత్రివేళనేగాక పగటిపూట సైతం పోలీసు గస్తీని నిర్వహించాలని ఆయన చెప్పారు. అనుమానితులను అదుపులోకి తీసుకొని విచారించాలని ఆదేశాలు జారీ చేశారు. గ్రామాలకు వెళ్లేవారు స్థానిక పోలీసులకు సమాచారమివ్వాలని వాళ్లకు డీజీపీ విజ్ఞప్తి చేశారు.