Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయాలి
- ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ సూచన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం సిఫారసులకు అనుగుణంగా బడ్జెట్ రూపకల్పన చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఫోరమ్ ఫర్ గుడ్ గవర్నెన్స్ కార్యదర్శి ఎం.పద్మనాభరెడ్డి కోరారు. ఈ మేరకు రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావుకు సోమవారం లేఖ రాశారు. రాష్ట్ర బడ్జెట్ తయారుచేస్తున్నప్పుడు రాష్ట్ర ఆర్థికసంఘం సిఫారసులను దృష్టిలో ఉంచుకొని స్థానిక సంస్థలకు హక్కుగా రావాల్సిన నిధులను కేటాయించాలని విన్నవించారు. రాష్ట్ర జనాభాలో 30 శాతం హైదరాబాద్‌లో ఉంటున్న రీత్యా అభివృద్ధి కోసం రూ.10 వేల కోట్లతో ప్రత్యేక గ్రాంట్‌ను బడ్జెట్లో పొందుపర్చాలని సూచించారు. విద్య, వైద్య రంగాలకు అధిక నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ పథకాల కోసమే బడ్జెట్లో 40 శాతానికిపైగా ఖర్చు చేస్తున్నారనీ, ఈ విషయంలో పొదుపు పాటించాలని సూచించారు. పదెకరాల వరకు కటాఫ్ పెట్టి రైతు బంధు ఇవ్వాలని కోరారు. మూడు మోటార్లు, 10 హెచ్‌పి వరకు రైతుకు ఉచిత కరెంటు ఇవ్వాలనీ, పెద్దపెద్ద రైతులకు అవసరం లేదని పేర్కొన్నారు. పెట్రోల్, డీజిల్‌పై లీటర్‌కు రూ.10 పన్ను తగ్గించాలని కోరారు. పాలనాపరంగా వృథా ఖర్చులను అరికట్టాలని సూచించారు.