Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్టీయూ డైరీ ఆవిష్కరణ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317 వల్ల వివిధ జిల్లాలకు కేటాయించిన ఉపాధ్యాయులకు సంబంధించిన సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామ ని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు. తెలంగాణ స్టేట్ టీచర్స్ యూనియన్ (టీఎస్టీయూ) నూతన సంవత్సరం డైరీని మంత్రి సోమవారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. 317 జీవోకు సంబంధించి స్పౌజ్ (భార్యాభర్తల) విషయంలో 13 జిల్లాలకు విధించిన బ్లాక్‌ను ఎత్తేయాలని టీఎస్టీయూ అధ్యక్షులు ఎండీ అబ్దుల్లా, ప్రధాన కార్యదర్శి సిహెచ్ రాజిరెడ్డి మంత్రి దృష్టికి తెచ్చారు. ఈ జీవో వల్ల ఇబ్బందులు పడి మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు కోటి రూపాయల ఎక్స్‌గ్రేషియా ప్రటించాలని కోరారు. వేసవి సెలవుల్లో హేతుబద్ధీకరణ, పదోన్నతులు, బదిలీలు చేపట్టాలని సూచించారు. ఈ అంశాలపై మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. టీఎస్టీయూ నూతన సంవత్సరం క్యాలెండర్‌ను రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు బోయిన్పల్లి వినోద్‌కుమార్ విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీఎస్టీయూ ఆర్థిక కార్యదర్శి అబ్సార్ అహ్మద్, అసోసియేట్ ప్రెసిడెంట్ కె శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు బండా నర్సింహారెడ్డి, ఎండీ హమీద్‌అలీ, కిష్టయ్య, అరకల కృష్ణాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.