Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జూబ్లీహిల్స్ మినిష్టర్ క్వార్టర్స్‌లో సెర్ప్ ఉద్యోగ సంఘాల క్యాలెండర్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోమవారం ఆవిష్కరించారు. సెర్ప్ ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు, పెండింగ్ ఇంక్రిమెంట్లు సహా పెండింగ్ అంశాలను పరిష్కరించాలని కోరుతూ వినతి పత్రాన్ని సమర్పించారు. మంత్రి సానుకూలంగా స్పందించినట్టు జేఏసీ నాయకులు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు కుంట గంగాధర్ రెడ్డి, ఏపూరి నర్సయ్య, మహేందర్‌రెడ్డి, సుభాష్, సుదర్శన్, ప్రవీణ్, సురేఖ, వెంకట్, రాజారెడ్డి ఉద్యోగులు పాల్గొన్నారు.