Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 220 మంది కోలుకున్నారు....
- ఖర్చు రూ.160 మాత్రమే...
- ఆస్పత్రిలో చేరే పని లేదు...
- ప్రభుత్వం పరిశీలించాలి: డాక్టర్ వసంత్ కుమార్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కరోనాకు వంద శాతం పని చేసే చికిత్సను అమలు చేసేందుకు వీలుగా దాన్ని పరిశీలించాలని హైదరాబాద్ కు చెందిన సివిల్ అసిస్టెంట్ సర్జన్ డాక్టర్ వసంత్ కుమార్ గౌరాని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు చికిత్సకు సంబంధించిన వివరాలతో ఒక వీడియోను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో విడుదల చేశారు. కరోనాకు వంద శాతం పని చేసే మందు లేని మొదటి, రెండో వేవ్ సమయంలో తాను చేసిన చికిత్సతో వంద శాతం ఫలితం వచ్చిందని తెలిపారు. ఈ ట్రీట్మెంట్తో 220 మంది కోలుకోగా వారిలో ఒక్కరు మాత్రమే అప్పటికీ వ్యాక్సిన్ వేసుకున్నారని తెలిపారు. వీరిలో మధుమేహం తదితర దీర్ఘకాలిక వ్యాధులున్నవారు కూడా ఉన్నారని వివరించారు. అన్ని వయస్సుల వారిపై ఈ చికిత్స పూర్తి స్థాయిలో పని చేస్తుందని తెలిపారు. అయితే కరోనాను తొందరగా గుర్తించి వెంటనే చికిత్స మొదలు పెట్టాల్సి ఉంటుందని చెప్పారు. 15 రోజుల పాటు కొల్చిసిన్ (జశీశ్రీషష్ట్రఱషఱఅవ ్abశ్రీవ్), సెరాటియోపెప్డియాస్ (ూవతీతీa్ఱశీజూవజూసఱaరవ ్abశ్రీవ్) అనే మందుల వాడటం ద్వారా నయం చేయొచ్చని తెలిపారు. గతంలో వచ్చిన డెల్టా, ప్రస్తుతం వేధిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌తో పాటు భవిష్యత్తులో వచ్చే వేరియంట్లపై ఇది పని చేస్తుందని స్పష్టం చేశారు. చికిత్స మొదలు పెట్టే సమయానికి ఊపిరితిత్తులు మరింత పాడు కావడం ఆగిపోతాయనీ, చికిత్స పూర్తయ్యే సమయానికి అవి మెరుగుపడతాయని చెప్పారు. ఎలాంటి స్టెరాయిడ్స్, యాంటీ వైరల్ డ్రగ్స్ వాడాల్సిన అవసరం లేదని వివరించారు. ఈ చికిత్స పూర్తిగా ఇంట్లోనే తీసుకోవచ్చనీ, ఆస్పత్రిలో చేరాల్సిన అవసరం లేదనీ, ఐసీయూ, ఆక్సిజన్ అంతకంటే అవసరం లేదన్నారు. రెమ్డెసీవిర్ లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఇచ్చే మందుల వాడకం కన్నా ఇది ఎంతో మెరుగైన చికిత్స అని పేర్కొన్నారు. ఈ మొత్తం చికిత్సకు కేవలం రూ.160 మాత్రమే ఖర్చవుతుందనీ, ఈ క్రమంలో ఈ మందును వినియోగించడం ద్వారా రాష్ట్రంలో పేద ప్రజలను కాపాడేందుకు ప్రభుత్వం ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు. తన అధ్యయనం సాధించిన ఫలితాలను ఇది వరకే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, రాష్ట్ర వైద్యవిద్య సంచాలకులు డాక్టర్ కె.రమేశ్ రెడ్డి తదితర ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్టు చెప్పారు. కరోనా మహమ్మారి సందర్భాన్ని కూడా కార్పొరేట్లు.... పేదలను మరింత పీడించేందుకు అనుకూలంగా వాడుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజలకు చౌకైన, వందశాతం ఫలితమిచ్చే ఈ చికిత్సను ఉపయోగించే విషయాన్ని సానుకూల దృక్పథంతో ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. సెకెండ్ వేవ్‌లో ఈ చికిత్సను మొదట తనతోనే మొదలు పెట్టినట్టు చెప్పారు.