Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బియ్యం తీసుకొచ్చేదే లేదు....
- కమిషనర్‌కు అంగన్వాడీ యూనియన్ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రవాణా ఖర్చులు చెల్లిస్తేనే రేషన్ షాపుల నుంచి బియ్యం తెచ్చుకుంటా మనీ, లేకపోతే జనవరి నుంచి ఆపేస్తామని తెలంగాణ అంగన్ వాడీ టీచర్స్, హెల్పర్స్ యూనియన్ (సీఐటీ యూ అనుబంధం) భద్రాద్రి కొత్త గూడెం కమిటీ హెచ్చరించింది. ఈ మేరకు సోమవారం హైదరాబాద్ లో ఐసీడీఎస్ కార్యాలయంలో జాయింట్ డైరెక్టర్ లక్ష్మీదేవికి ఆ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జయలక్ష్మి నేతృత్వంలో జిల్లా అధ్యక్షురాలు ఈసం వెంకటమ్మ, ప్రధాన కార్యదర్శి జిలుకర పద్మ, నాయకులు ఎం.విజయశీల, కృష్ణవేణి, అలివేలు మంగ వినతి పత్రం సమర్పించారు. పెండింగ్ బకాయిలు రూ.21,600 వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. రవాణా ఖర్చులను తక్షణమే ప్రభుత్వం చెల్లించాలనీ, లేకపోతే బియ్యాన్ని అంగన్ వాడీ కేంద్రాలకు నేరుగా సరఫరా చేయాలని కోరారు. ఒకవేళ ప్రభుత్వం రవాణా చేయక పోతే ప్రతి నెలా రవాణా ఛార్జీల కింద నెలకు రూ.300 నుంచి రూ.600 తక్కువ కాకుండా ప్రతి నెలా వేతనంతో పాటు ఇవ్వాలనీ, అన్ని సరకులను ఒకేసారి సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. డిమాం డ్లు నెరవేర్చకపోతే భవిష్యత్తులో జరిగే పరిణామాలకు ప్రభుత్వమే బాధ్యత వహించాలని హెచ్చరించారు.