Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎయిర్‌పోర్టులో బంగారం పట్టివేత
నవతెలంగాణ -శంషాబాద్
బంగారాన్ని అక్రమంగా తరలించేం దుకు స్మగ్లర్లు కొత్త కొత్త దారులు ఎంచుకుంటున్నారు. ఓ వ్యక్తి విస్మయం కలిగించేలా బంగారాన్ని తరలించేందుకు పూనుకున్నాడు. అనుమానం వచ్చిన అధికారులు తనిఖీ చేయగా పట్టుబడ్డాడు. ఈ ఘటన రంగారెడ్డి శంషాబాద్‌లోని హైదరాబాద్ ఆర్జీఐ ఎయిర్‌పోర్టులో సోమవారం జరిగింది. కస్టమ్స్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆదివారం షార్జా నుంచి జి9-450 ఫ్లైట్‌లో హైదరాబాద్ ఎయిర్‌పోర్టుకు ఓ వ్యక్తి వచ్చాడు. అతను తన రెండు కాళ్ళు విరిగాయంటూ కట్లు కట్టుకొని నడుస్తూ బయటకు వచ్చాడు. అనుమానంతో అధికారులు పట్టుకుని అతని కాళ్లు పరిశీలించి స్కానింగ్ తీయగా.. ప్యూర్ గోల్డ్ దొరికింది. బ్యాండేజీల్లో రూ.47.55 లక్షల విలువ చేసే 970 గ్రాముల బంగారాన్ని దాచాడు. బంగారాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు.. నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నారు. ఎలా చూసినా కేజీ గోల్డ్ అక్రమ రవాణా చేస్తే కనిష్టంగా రూ.3 నుంచి రూ.4లక్షల లాభం ఉంటోందని అంచనా వేస్తున్నారు. కాగా, ఇండియన్ మార్కెట్లో గోల్డ్ ధర పెరగడంతో పాటు ఇంపోర్ట్ ట్యాక్స్ పైకి, రూపాయి విలువ కిందికి చేరడమే ఈ స్మగ్లర్లకు కలిసి వస్తోందని అధికారులు స్పష్టం చేస్తున్నారు.