Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడ్రోజుల పాటు పలుజిల్లాల్లో వడగండ్ల వానలు!
- చాలా ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోవచ్చే రెండు రోజులు(నేడు,రేపు) ఆదిలాబాద్, కొమ్రంభీమ్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో వడగండ్ల వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రధాన అధికారి కె.నాగరత్న తెలిపారు. చాలా ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని పేర్కొన్నారు. ఉత్తర ఇంటీరియల్ కర్నాటక నుంచి ఉత్తర, మధ్య మహారాష్ట్ర వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఆకాశం మేఘావృతమై ఉంది. ఉదయం సమయాల్లో పొగమంచు ఏర్పడుతున్నది. దక్షిణ, నైరుతి నుంచి గాలులు వీస్తున్నాయి. మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో అత్యల్పంగా 15.2 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఆదిలాబాద్ జిల్లాలో సోమవారం జన్నారం మండలంలో వడగండ్ల వాన కురిసింది. పలు చోట్ల చెట్లు నేలకూలాయి.