Authorization
Sun April 13, 2025 12:20:39 am
- పీఆర్టీయూ తెలంగాణ నేతలకు సీఎస్ హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనెంబర్ 317 వల్ల నష్టపోయిన ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని పీఆర్టీయూ తెలంగాణ నేతలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్ హామీ ఇచ్చారు. పాతూరి సుధాకర్‌రెడ్డి నేతృత్వంలో పీఆర్టీయూ తెలంగాణ అధ్యక్షులు ఎం చెన్నయ్య, ప్రధాన కార్యదర్శి ఎం అంజిరెడ్డి మంగళవారం హైదరాబాద్‌లోని సీఎస్‌ను కలిశారు. ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. సీనియార్టీ జాబితాలో తప్పులను సవరించి వారికి న్యాయం చేయాలని సీఎస్‌కు వివరించారు. జిల్లాల విభజనలో స్థానికత కోల్పోయిన ఉపాధ్యాయులకు పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని కోరారు.
విభజన పూర్తయిన అన్ని విభాగాల్లోనూ పదోన్నతులు చేపట్టాలని సూచించారు. వాటి కోసమే విభజన చేస్తున్నామని సీఎస్ హామీ ఇచ్చారు. 317 జీవో ఉపాధ్యాయుల సంక్షేమం కోసమేననీ, అందరూ సహకరించాలని వివరించారు. అనంతరం విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాను కలిసి వినతిపత్రం సమర్పించారు.