Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అమరవీరుల స్థూపం వద్ద కాంగ్రెస్ నిరసన
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఆరేండ్ల గిరిజన బాలికపై లైంగిదాడికి పాల్పడిన నిందితుడు, టీఆర్ఎస్ నాయకుడు రాదారాపు శంకర్‌కు బెయిల్ విషయంలో మంత్రి కేటీఆర్ సాయం చేశారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి బక్కజడ్సన్ ఆరోపించారు. అందుకు నిరసనగా మంగళవారం అసెంబ్లీ ముందున్న అమరవీరుల స్థూపం వద్ద నినూత్న ధర్నా చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, చిన్నారులకు రక్షణ కల్పించాల్సిన వారే లైంగికదాడికి ప్పాలడుతున్నారని ఆరోపించారు. ఎల్లారెడ్దిపేట్ మండలం, ఆల్మాస్పూర్ గ్రామ సర్పంచ్ భర్త శంకర్ బాలికపై అత్యాచానికి ఒడిగట్టారని విమర్శించారు. ప్రజాసంఘాల ఒత్తిడిమేరకు నిందితుడిపై కేసు నమోదు చేయగా, మంత్రి కేటీఆర్ సహకారంతో ఆయనకు బెయిల్ వచ్చిందని చెప్పారు. ఈ నేపథ్యంలో జాతీయ మహిళ కమిషన్, జాతీయ ఎస్టీ కమిషన్లకు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఉజ్మాషాకీర్ తదితరులు ఉన్నారు.
ఆందోళన వద్దు...రైతుబంధు అందుతుంది : మంత్రి నిరంజన్‌రెడ్డి
రైతు బంధు డబ్బుల విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి చెప్పారు. నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు రావడంతో అంతరాయం ఏర్పడిందని పేర్కొన్నారు. ఈమేరకు మంగళవారం మంత్రి ఒక ప్రకటన విడుదల చేశారు. ఇప్పటి వరకు మొత్తం 60,16,697 మంది రైతుల ఖాతాల్లో రూ 6008.27 కోట్లు జమ చేశామని పేర్కొన్నారు. ఏడు ఎకరాలున్న రైతులందరి వరకు ఖాతాల్లో డబ్బులు జమ అయ్యాయని తెలిపారు. అర్హుల జాబితాలో ఉండి మిగిలిపోయిన వారికి ఒకట్రెండు రోజుల్లో నిధులు జమ అవుతాయని వివరించారు.