Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పీయూసీ చైర్మెన్ జీవన్‌రెడ్డి విమర్శ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీజేపీ జాతీయ నాయకులు సర్కస్ కంపెనీలో జోకర్లుగా వ్యవహరిస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) చైర్మెన్ ఆశన్నగారి జీవన్‌రెడ్డి విమర్శించారు.బీజేపీ పాలిత రాష్ట్రాల సీఏంలు, నాయకులు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీర్‌పై అవాకులు చవాకులు పెలుతున్నారని అన్నారు. వారికి కేసీఆర్‌ను విమర్శించే స్థాయి లేదని పేర్కొన్నారు. వార్డు మెంబర్‌గా కూడా గెలవలేని బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు కేసీఆర్‌ను అవినీతిపరుడంటు న్నారని తెలిపారు. ఆయనపై టికెట్లు అమ్ముకున్న కేసులున్నాయని గుర్తుచేశారు. మంగళవారం హైదరాబాద్‌లోని టీఆఆర్ఎస్ శాసనపక్ష కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ జోలికొస్తే..తెలంగాణతోపాటు దేశం అగ్నిగుండంగా మారుతుందని హెచ్చరించారు. శివరాజ్‌సింగ్ చౌహాన్ దొడ్డిదారిన సీఎం అయ్యారని చెప్పారు. హేమంత్ బిశ్వా శర్మ కాంగ్రెస్‌లో ఉండి, బీజేపీకి కోవర్టుగా మారిన విషయం తెలిసిందేనన్నారు. బీజేపీ నేతలకు కండ్లు లేవు కాబట్టే వారికి తెలంగాణలో అభివృద్ది కనిపించటం లేదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్న నలుగురు బీజేపీ ఎంపీలు రాష్ట్రాభివృద్ధికి ఎం చేశారో చెప్పాలన్నారు. అవసరాన్ని కేసీఆర్ యూపీలో ఎన్నికల ప్రచారం చేస్తారని చెప్పారు. రేవంత్ రెడ్డి బీజేపీకి బి టీం అని విమర్శించారు.