Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కేసుల పెరుగుదలతో సర్కారు యోచన
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉన్నది. రాష్ట్రంలో ఆదివారం 1,673 కేసులు, సోమవారం 1,825 కేసులు, మంగళవారం 1,920 కేసులు నమోద య్యాయి. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యాసంస్థలకు ఈనెల 20 వరకు సెలవులుపొడిగించే అవకాశమున్నది. ఈదిశగా రాష్ట్ర ప్రభుత్వం సమాలోచన చేస్తున్నట్టు సమాచారం. సంక్రాంతిపండుగ సందర్భంగా ఇప్పటికే ఈనెల16 వరకు సెలవులు ప్రకటించినవిషయం తెలిసిందే. ఇంకో వైపు కరోనా కేసులు పెరుగుతున్న సందర్భంగా కరోనా ఆంక్షల ను ఈనెల 20 వరకు ప్రభుత్వం పొడిగిస్తూ జీవోనెంబర్ ఆరును ఈనెల తొమ్మిదిన విడు దల చేసిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు, ఉపాధ్యాయులు, అధ్యాపకుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సెలవులను మరో నాలుగు రోజులు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.