Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గ్రామీణ ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో అవసరమైన పరికరాలను తయారు చేసే వారికి ప్రోత్సహించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన అగ్రి హబ్, రాష్ట్ర ఐటీ శాఖకు చెందిన తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ సెల్ ఒప్పందం కుదుర్చుకున్నాయి. మంగళవారం హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్, యూనివర్సిటీ వైస్ ఛాన్సెలర్ ప్రవీణ్ రావు, అగ్రి హబ్ ఎండీ డాక్టర్ ఆర్.కల్పనా శాస్త్రి, టీఎస్ఐసీ సస్టేనబులిటీ, స్కేలబిలిటీ అధినేత ఎ.విజయ, టీఎస్ఐసీ ఇన్నోవేషన్ ఫెల్లో ధృతి కలవపూడి పాల్గొన్నారు. గ్రామాల్లో నూతన ఆవిష్కరణలు చేసే వారికి అవసరమైన సాంకేతిక సహకారం అందించేందుకు ఈ ఒప్పందం ఉపయోగపడుతుందని వారు తెలిపారు.