Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్య, వైద్యం, తయారీ, ఐటీ, బీపీఓలో భారీగా ఖాళీలు : తాజా సర్వే
న్యూఢిల్లీ : ప్రభుత్వరంగానికి తొమ్మిది సెక్టార్లలో దాదాపు 4.3లక్షల ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయని తాజా సర్వే ఒకటి వెల్లడించింది. మొత్తం ఖాళీల్లో ఉద్యోగుల రిటైర్మెంట్తో ఏర్పడేవి కేవలం 11.7శాతమే ఉన్నాయని ఈ సర్వేలో పేర్కొన్నారు. సర్వేకు సంబంధించి మీడియాకు విడుదల చేసిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. ప్రభుత్వానికి చెందిన తొమ్మిది సెక్టార్లలో దాదాపు 5.6శాతం ఉద్యోగ ఖాళీలు ఏర్పడ్డాయి. వీటి సంఖ్య సుమారుగా 4.3లక్షల వరకు ఉండొచ్చు. ఆయా శాఖల్లో ఏర్పడ్డ 65.8శాతం ఉద్యోగ ఖాళీలు రాజీనామా, రిటైర్మెంట్ వల్ల వచ్చినవి కావు. ఉద్యోగుల రాజీనామాతో ఏర్పడ్డ ఖాళీలు సుమారుగా 23శాతం ఉండొచ్చు. మొత్తం ఉద్యోగ ఖాళీల్లో 91శాతం విద్య, వైద్యం, తయారీ, ఐటీ, బీపీఓ...రంగాల్లో ఉన్నాయి.