Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మంత్రి సబితా ఇంద్రారెడ్డి హామీ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
టీఆర్టీ-2017కు ఎంపికైన గిరిజన అభ్యర్థులకు త్వరలోనే నియామాల ప్రక్రియను పూర్తి చేస్తామని విద్యాశాఖ మంత్రి పి సబితా ఇంద్రారెడ్డి హామీ ఇచ్చారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, ఆదిలాబాద్‌కు చెందిన సుమారు 200 మంది అభ్యర్థులు సోమవారం మంత్రిని కలిసి నియామకాలు త్వరగా చేపట్టాలని కోరారు. మంత్రి సానుకూలంగా స్పందించారని తెలిపారు. త్వరగా నియామకాల ప్రక్రియను పూర్తి చేస్తామని హామీ ఇచ్చారని పేర్కొన్నారు. తమకు ప్రభుత్వం, విద్యాశాఖ పట్ల పూర్తి విశ్వాసం ఉందని టీఆర్టీ-2017 ఏజెన్సీ అభ్యర్థులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉద్యోగాల కోసం ఎంతో కాలం నిరీక్షిస్తున్నామని వివరించారు. విద్యామంత్రి హామీ మేరకు ఉద్యోగాలు పొందుతున్నందుకు తమ కుటుంబాల్లో ఆనందంగా ఉందని పేర్కొన్నారు. ప్రభుత్వానికి, విద్యామంత్రికి, అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. తాము ఎలాంటి ధర్నాలు, దీక్షలకు పిలుపు ఇవ్వలేదని స్పష్టం చేశారు.