Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా ఆల్ ఇండియా ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
- జియాగూడలో ముగ్గుల పోటీలు
నవతెలంగాణ-ధూల్‌పేట్
ప్రజల్లో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించేది సంక్రాంతి పండుగ అని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. సంక్రాంతి పండుగను పురస్కరించుకొని మంగళవారం హైదరాబాద్ సౌత్ జిల్లా జియాగూడ డివిజన్లో ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మహిళలనుద్దేశించి మాట్లాడారు. నిత్యం ఆర్థిక ఇబ్బందులు.. కరోనా కల్లోలం నేపథ్యంలో ప్రజలకు, పిల్లలకు సంక్రాంతి పండుగ మానసిక ఉల్లాసాన్ని తీసుకొస్తుందన్నారు. అనంతరం బాలబాలికలలో మాట్లారు. ముగ్గుల పోటీల విజేతలకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ఆర్.అరుణ జ్యోతి, రాష్ట్ర కమిటీ సభ్యులు స్వరూప, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.శశికళ, మీసాల లక్ష్మమ్మ, జిల్లా కమిటీ సభ్యులు కందుల నాగమణి, రాణిబాయి, డివిజన్ కమిటీ సభ్యులు లావణ్య, నవనీత తదితరులు పాల్గొన్నారు.