Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1981 నుంచి ప్రజాశక్తి, నవతెలంగాణలో పనిచేసిన రాధాకృష్ణమూర్తి
నవతెలంగాణ-సిటీబ్యూరో
గంగవరపు రాధాకృష్ణమూర్తి(63) మంగళవారం మధ్యాహ్నం 2గంటలకు మౌలాలి హౌసింగ్‌బోర్డు కాలనీలో అనారోగ్యంతో మృతిచెందాడు. ఈయన్ను అందరు ప్రేమతో జీఆర్కే బాబారు అని పిలుస్తారు. అయితే, గతేడాది ఆయన భార్య మృతిచెందింది. ఆయనకు కొడుకు ఉన్నాడు. జీఆర్కే స్వస్థలం విజయవాడలోని తాడేపల్లి చిన్నప్పటి నుంచి ఆదర్శ భావాలు కల్గిన వ్యక్తి. 1981 విజయవాడలో ప్రజాశక్తి ఎడిషన్ ప్రారంభం నుంచి ప్రింటింగ్ ప్రెస్ కంపోజింగ్, ప్లేట్మేకింగ్లో పనిచేశారు. సంస్థ అవసరాల నిమిత్తం తిరుపతి, కర్నూల్ ఎడిషన్‌లో సేవలందించారు. విజయవాడలో పనిచేసేటప్పుడు మోటూరు ఉదయంతో కలిసి ఇండ్ల జాగాల కోసం పోరాటం చేసి ఇండ్ల స్థలాలు ఇప్పించడంలో ఎంతో కృషి చేశారు. ప్రజాశక్తిలోనూ యూనియన్ కార్యదర్శిగానూ పనిచేశారు. తర్వాత హైదరాబాద్ ఎడిషన్‌లో 2001 నుంచి సేవలందించారు. నవతెలంగాణ దినపత్రిక ఏర్పడిన తర్వాత ప్రింటింగ్ ప్రెస్ ప్రొడక్షన్ సూపర్వైజర్గా పనిచేశారు.
అంత్యక్రియలు పూర్తి
జీఆర్కే అంత్యక్రియలు హైదరాబాద్ మల్లాపూర్ ఎన్ఎఫ్సీ శ్మశానవాటిలో మంగళవారం ముగిశాయి. ఆయన మృతదేహాన్ని నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ జనరల్ మేనేజర్ రఘు, మార్కెటింగ్ మేనేజర్ ఉపేందర్‌రెడ్డి సందర్శించి నివాళి అర్పించారు. జీఆర్కే మృతి ప్రజాశక్తి, నవతెలంగాణ ప్రింటింగ్ప్రెస్లకు తీరని లోటన్నారు. అంత్యక్రియల్లో నవతెలంగాణ ప్రింటింగ్ ప్రెస్ ప్రొడక్షన్ ఇన్చార్జి బి.పురుషోత్తం, శ్రీనివాస్‌రెడ్డి, మిషన్ సెక్షన్ సభ్యులు శేఖర్, సత్యం, సుధీర్, రాజు, నగేష్, సురేష్, నాగరాజు, సత్యం, శంకర్, భాస్కర్, సిబ్బంది పాల్గొని నివాళి అర్పించారు.