Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఈఈఏ డైరీ ఆవిష్కరణలో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
అంతర్గత సామర్ధ్యం పెంచుకొని, విద్యుత్‌రంగంలో నష్టాలను తగ్గించాలని టీఎస్జెన్కో, ట్రాన్స్‌కో సీఎమ్‌డీ దేవులపల్లి ప్రభాకరరావు చెప్పారు. ఈ రంగం వేగంగా అభివృద్ధి చెందడానికి నిబద్ధతతో కూడిన సిబ్బంది కష్టపడే తత్వమే కారణమని కొనియాడారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ (టీఈఈఏ) 2022 నూతన సంవత్సర డైరీని మంగళవారంనాడాయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పీఆర్సీ-2022, హెచ్ఆర్ఏ పెంపుదల, ప్రమోషన్లు, ఈపీఎఫ్ టు జీపీఎఫ్ వంటివి న్యాయమైన డిమాండ్లు అనీ, వాటి పరిష్కారానికి సానుకూల నిర్ణయాలు తీసుకుంటామన్నారు. టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎమ్‌డీ జీ రఘుమారెడ్డి మాట్లాడుతూ మీటర్ అమ్మకాల ఆదాయం పెంచి డిస్కంల ఆదాయాన్ని పెంచాలని కోరారు. ట్రాన్స్‌కో జేఎమ్డీ శ్రీనివాసరావు మాట్లాడుతూ విద్యుత్ సవరణ చట్టం, కేంద్రప్రభుత్వ నూతన మార్గదర్శకాలు విద్యుత్‌రంగం ఎదుర్కొనే అతిపెద్ద సవాళ్లు అని చెప్పారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన టీఈఈఏ అధ్యక్షులు ఎన్ శివాజీ మాట్లాడుతూ మింట్ కాపౌండ్‌లో జయశంకర్ భవన్ నిర్మాణానికి సభ్యులందరూ సహకరిం చాలని విజ్ఞప్తి చేశారు. ఎస్పీడీసీఎల్ పరిధిలో చాలాకాలంగా పెండింగ్ లో ఉన్న ప్రమోషన్లు, రివర్షన్ల సమస్యల్ని పరిష్కరించాలని కోరారు. సమావేశంలో డైరీ కమిటీ చైర్మెన్ వై నర్సింహారెడ్డి, ముఖ్యసలహాదారు సురేందర్‌రెడ్డి, తుల్జారాంసింగ్, బందెలరవి, ఎంఎన్ రాజేష్, వెంకట్రామయ్య, పున్నానాయక్ తదితరులు పాల్గొన్నారు.