Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రైతాంగఉద్యమ భవిష్యత్తు కార్యచరణను జాతీయ కౌన్సిల్ సమావేశాల్లో రూపొందిం చినట్టు వారు తెలిపారు. జనవరి 15న ఢిల్లీలో సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) సమావేశమై ఉద్యమకార్యచరణ రూపొంది స్తుందని చెప్పారు. 1982 జనవరి19న జరిగిన తొలి జాతీయ సార్వత్రిక సమ్మె సందర్భంగా పోలీసు కాల్పుల్లో కార్మికులు మరణించారనీ, అందుకు గుర్తుగా జనవరి 19న దేశ వ్యాప్తం గా కార్మిక,కర్షక ఐక్యతా దినాన్ని పాటించాలని పిలుపునిచ్చారు. జిల్లా, తాలుకా, మండల, గ్రామ కేంద్రాల్లో రైతులు, రైతు కూలీలు, కార్మికులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాలనికోరారు. ఫిబ్రవరి 23,24 తేదీల్లో కార్మిక సంఘాలు తలపెట్టిన దేశవ్యాప్త సమ్మెకు ఏఐకేఎస్ తరుపున సంపూర్ణ మద్దతు ప్రకటించారు. నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలనీ, కనీస మద్దతు ధరల చట్టాన్ని ఆమెదించాలని కోరారు. ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలనీ, బీజేపీ సర్కారు ప్రయివేటీకరణ విధానాలను విరమించుకోవాలని డిమాండ్ చేశారు.