Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేత కార్మికునికి మంత్రుల అభినందనలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
అద్భుతమైన నేత సాంప్రదాయాన్ని కొనసాగిస్తూ అగ్గిపెట్టెలో పట్టే చీరెని సిరిసిల్లకు చెందిన నల్ల విజరు రూపొందించారు. మంగళవారం హైదరాబాద్లో మంత్రులు కేటీఆర్, ఎర్రబెల్లి, సబితా ఇంద్రారెడ్డి, శ్రీనివాసగౌడ్ సమక్షంలో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆ చీరెను ఆయన ప్రదర్శించారు.ఈ సందర్భంగా విజరును మంత్రులు ప్రశంసించారు. నేత ప్రక్రియను, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్నారు. అగ్గిపెట్టెలో పట్టే చీరె గురించి వినడమే కానీ తొలిసారి చూస్తున్నామని... ఇంత అద్భుతమైన చీరెను నేసిన విజరును మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రత్యేకంగా ప్రశంసించారు. తాను నేసిన ఈ చీరెని ఆమెకు విజరు అందించారు. ప్రభుత్వ కార్యక్రమాలతో సిరిసిల్లలోని నేత రంగంలో అనేక మార్పులు వచ్చాయనీ, అక్కడి నేతన్నలు ఆధునికమైన మరమగ్గాలు, పద్దతుల వైపు మారుతున్నారని మంత్రులకు తెలిపారు. ప్రస్తుతం తాను నేసిన చీరె మూడు రోజులు మరమగ్గాలపై నేసే అవకాశం ఉంటుందనీ,... అదే చీరెను చేతితో నేయాలంటే రెండు వారాల సమయం పడుతుందని ఈ సందర్భంగా తెలిపారు. ఆయన చేసే భవిష్యత్తు ప్రయత్నాలకు సంపూర్ణంగా సహకారమందిస్తామని మంత్రులు తెలిపారు.