Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తాం
- పీఎం ఫసల్ బీమాతో అన్నదాతకు ఒరిగిందేమీ లేదు
- చారిత్రాత్మక రైతాంగ విజయం కొత్త అధ్యయానికి నాంది
- కార్మిక, కర్షత ఐక్యత నూతన ఒరవడికి శ్రీకారం
- 19న కార్మిక కర్షక ఐక్యత దినంగా పాటించాలి
- దేశవ్యాప్త సమ్మెకు సంపూర్ణ మద్దతు : ఏఐకేఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్మొల్లా వెల్లడి
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దేశంలో మతతత్వ బీజేపీని ఓడించడం ద్వారానే వ్యవసాయానికి, రైతుకు రక్షణ ఉంటుందనీ, అందువల్ల ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఆ పార్టీని ఓడించాలని అఖిల భారత కిసాన్ సభ (ఏఐకేఎస్) అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు అశోక్ ధావలే, హన్నన్ మొల్లా పిలుపునిచ్చారు. ఆ దిశగా అన్ని ప్రయత్నాలు చేస్తామని వెల్లడించారు. త్వరలో జరగనున్న ఉత్తర ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని మట్టికరిపించాలంటూ రైతులు, వ్యవ సాయ కార్మికులు, మహిళలు, యువత, విద్యార్థులకు పిలుపునిచ్చారు. రైతు సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసు కొచ్చిన ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజనతో రైతులకు ఒరిగేదేమీ లేదని విమర్శించారు. అతివృష్టి, అనావృష్టితో లక్షల ఎకరాల్లో పంట దెబ్బతిన్నప్పటికీ రైతులకు పరిహారం అందడం లేదని చెప్పారు. రెండు రోజులపాటు కొనసాగిన ఏఐకేఎస్ జాతీయ కౌన్సిల్ సమావేశాలు హైదరాబాద్లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మంగళవారం ముగిశాయి. ఏఐకేఎస్ కార్యకలాపాలు, రైతాంగ ఉద్య మం, వ్యవసాయ ఎదుర్కొంటున్న అనేక సవాళ్లపై సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించారు. అందులో తీసుకున్న నిర్ణ యాలను ఏఐకేఎస్ జాతీయ సహాయ కార్యదర్శి విజ్జుకృష్ణన్, కోశాధికారి కృష్ణ ప్రసాద్, ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లా రెడ్డి, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి జంగా రెడ్డి, టి సాగర్, ఉపాధ్యక్షులు మాదినేని రమేష్, సహాయ కార్యదర్శి మూడ్శోభన్తో కలిసి అశోక్ ధావలే, హన్నన్ మొల్ల విలేకర్లకు వివరించారు. దేశంలో చారిత్రాత్మక రైతాంగ ఉద్యమం జరిగిందని ప్రశంసించారు. సుదీర్ఘ కాలంపాటు కొనసాగిన రైతాంగ ఉద్యమంగా ఇది దేశ చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. రైతులపాలిట ప్రమాదకరంగా పరిణమించిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 500 రైతు సంఘాలు ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేశాయని తెలిపారు. రైతాంగ పోరాటంలో 700 మందికిపైగా రైతులు పైగా రైతులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతు ఉద్యమానికి దేశ, విదేశాల నుంచి మద్దతు లభించిందని తెలిపారు. ఆయా దేశాల్లో భారత రాయబారుల కార్యాలయాల వద్ద నిరసనలు జరిగాయని గుర్తు చేశారు. బీజేపీ సర్కారు రైతులపై 48వేల అక్రమ కేసులు బనాయించిందనీ, ఎంతో మంది రైతులను నిర్బంధించిందని తెలిపారు. కేంద్ర సర్కారు ఎన్ని ఆటంకాలు కల్పించినప్పటికీఅన్నదాతలు వెనక్కితగ్గలేదని చెప్పారు. ఈ క్రమంలో దేశంలోని ఉత్పత్తి వర్గాలన్నీ ప్రత్యక్ష పోరాటం చేశాయనీ, మోడీ సర్కారుకు మరో గత్యంతరంలేకపోవడంతో మూడు నల్ల చట్టాలను ఉపసంహరించుకుందని వివరించారు. కనీస మద్దతు ధరల చట్టం (ఎమ్ఎస్పీ) సాధించాల్సిఉందని చెప్పారు. కార్మిక హక్కులను కాలరాస్తున్న నాలుగు లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రైతులపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలనీ, మరణించిన రైతుల కుటుంబాలకు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
తీర్మానాలు
- ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలి.
- ఫిబ్రవరి 23,24న దేశ వ్యాప్త సమ్మెకు మద్దతు.
- మతం పేరుతో విభేదాలు సృష్టించే చర్యలకు వ్యతిరేకంగా ఉద్యమించాలి.
- పంట నష్ట పరిహారం చెల్లించాలి.
- కేరళ ప్రభుత్వం చేపట్టిన సిల్వర్ రైల్ ప్రాజెక్టుకు మద్దతు.
- ఉపాధి హామీ పథకాన్ని బలోపేతంచేయాలి.