Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు, అల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్
నవతెలంగాణ-శేరిలింగంపల్లి
యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన భూములకు ఎలాంటి చట్టబద్దత లేదంటూ ఇటీవల హైకోర్టు సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పుపై విద్యార్థుల్లో, అధ్యాపకుల్లో, దేశ ప్రజల్లో ఆందోళన మొదలైందని స్టూడెంట్స్ అసోసియేషన్ సభ్యులు, ఆల్ ఇండియా ఓబీసీ స్టూడెంట్స్ అసోసియేషన్ నేషనల్ ప్రెసిడెంట్ కిరణ్ అన్నారు. రంగారెడ్డి జిల్లా గచ్చిబౌలిలోని హెచ్‌సీయూ వద్ద బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేశంలో అత్యంత ప్రసిద్ధిగాంచిన, దక్షిణ భారతదేశానికే తల మానికం అయిన యూని వర్శిటీ ఉనికే నేడు ప్రమాదంలో పడిందన్నారు. 1969లో జరిగిన తెలంగాణ ఉద్యమంలో 399 మంది పోరాటమోధుల బలిదానం కారణంగా 6 పాయింట్స్ జీవోలో భాగంగా తెలంగాణకు అప్పటి ప్రధాని ఇందిరాగాంధీ కేంద్రీయ విశ్వవిద్యాలయాన్ని ఇచ్చినట్టు తెలిపారు. ఆనాడు నగరానికి దూరంగా అడవిగా ఉన్నటువంటి సువిశాల ప్రాంతంలో 2,324 ఎకరాల భూమిని కేటాయించినట్టు తెలి పారు. యూనివర్శిటీకి మొదటి వైస్ చాన్స్‌లర్‌గా ఉన్న గుర్ భక్షిసింగ్ రెండేండ్ల కృషితో దాదాపు 29 కిలోమీటర్ల విస్తీర్ణంలో ''గ్రేట్ వాల్ ఆఫ్ యూనివర్శి టీని'' నిర్మించినట్టు తెలిపారు. తదానంతర పరిస్థితు ల్లో హైదరాబాద్ నగరం అభివృద్ధి చెంది, ఐటీ హబ్‌గా మారడంతో ఇక్కడి భూముల విలువ అమాంతం పెరిగిపోయిందన్నారు. దాంతో రాజ కీయ నాయకులు, ప్రభుత్వధి కారులు అధికారాన్ని అడ్డుపెట్టుకుని యూనివర్శిటీ భూములను కబ్జా చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. దీనిలో భాగంగానే ఇటీవలి కాలంలో యూనివర్శిటీ ఆఫ్ హైదరాబాద్‌కు చెందిన 394 ఎకరాల భూములను కబ్జా చేయాలనే కుట్ర జరిగిందన్నారు. యూనివర్సిటి ని రక్షించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. యూనివర్సిటీ భూముల జోలికి వస్తే పెద్దఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశం లో తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్ శివ, జనరల్ సెక్రటరీ ఓర్సు కొండల్, విద్యార్థులు పాల్గొన్నారు.