Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎస్ జీహెచ్ఎంఏ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల్లో ఖాళీలు చూపించిన తర్వాతే ఆప్షన్ ఫారాలను ఇవ్వడం సబబుగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం సూచించింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పి.రాజభాను చంద్రప్రకాశ్, ప్రధాన కార్యదర్శి ఆర్.రాజ గంగారెడ్డి, కోశాధికారి బి.తుకారాం బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. మల్టీ జోన్ వన్ నుంచి 2 కు, 2 నుండి 1 అలాట్మెంట్ అయిన ప్రధానోపాధ్యాయులకు పాఠశాలల ఖాళీలను చూపకుండా ఆప్షన్ ఫార్మ్స్ సబ్మిట్ చేయమని ఆర్ జె డి కార్యాలయాల నుంచి ఫోన్ ద్వారా జిల్లా పేర్లను ఎంచుకొని సమర్పించాలంటూ ఆదేశించడాన్ని ఖండించారు.
జిల్లాల్లోని పాఠశాలల ఖాళీలను చూపకుండా ఆప్షన్ ఫారాలను ఇవ్వాలని ఒత్తిడి చేయడం జీవో నెంబర్ 317 కు విరుద్ధమని పేర్కొన్నారు.