Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి టీపీటీఎఫ్ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేస్తున్న గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలని తెలంగాణ ప్రొగ్రెసివ్ టీచర్స్ ఫెడరేషన్ (టీపీటీఎఫ్) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) సోమేశ్‌కుమార్‌కు బుధవారం టీపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు, అసోసియేట్ అధ్యక్షులు వై అశోక్‌కుమార్, అదనపు ప్రధాన కార్యదర్శి ఎన్ తిరుపతి లేఖ రాశారు. గెజిటెడ్ ప్రధానోపాధ్యాయుల ఐచ్ఛికాలు లేకుండానే మల్టీ జోన్-1 నుంచి 2కు మార్చారని తెలిపారు. పాఠశాలలు లేకుండా అధికారులు జిల్లాల ఆప్షన్లు అడగడం వారిని మరింత ఇబ్బందులకు గురిచేస్తున్నారని పేర్కొన్నారు.
పాత జిల్లాల పరిధిలో సీనియార్టీ ప్రకారం కేటాయించి పోస్టింగ్‌కు మాత్రం మల్టీ జోన్ పరిధిలో జిల్లాలకు ఆప్షన్ అడగడం అన్యాయమని విమర్శించారు. వారు పనిచేస్తున్న జిల్లాల్లోనే ఖాళీలున్నందున అక్కడే పోస్టింగ్‌లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.