Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణిలో సోలార్ పవర్ ప్లాంట్స్‌లో విధులు నిర్వహిస్తున్న సెక్యూరిటీ గాడ్స్ బుధవారం మెరుపు సమ్మెకు దిగారు. కనీస వేతనాలివ్వాలని, పెండింగ్ వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సమ్మె చేశారు. ప్లాంట్ ప్రధాన ద్వారం మూసేశారు. గేటు ఎదుట నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఇప్టూ సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు యన్.సంజీవ్, రీజియన్ అధ్యక్షులు పి.సతీష్ మాట్లాడారు. సోలార్ పవర్ ప్లాంట్‌లో విధులు నిర్వహిస్తున్న కార్మికులకు వేతనాలు చెల్లించకుండా కాంట్రాక్టర్ అనేక ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. ఇప్పటికే దసరా, దీపావళి పండుగలకు పస్తులున్న కార్మికులు, సంక్రాంతికి కూడా పస్తులుండాలా అని ప్రశ్నించారు. ఈ విషయంలో సింగరేణి యాజమాన్యం, అదానీ సంస్థకు పలుమార్లు వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగు నెలలుగా వేతనాలు లేక ఇబ్బందులు పడుతున్నప్పటికీ సింగరేణి యాజమాన్యం కాంట్రాక్టర్‌పై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. సమ్మె విరమించేది లేదని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సముద్రాల సత్యనారాయణ, శ్రావన్, అజరు, అనుదిప్, కార్తిక్, కృష్ణ ప్రసాద్, సూబాష్, రమేష్, రాదకృష్ణ, లోహిత్, డెవిడ్, నపీజ్, వంశీ, విశాక్ తదితరులు పాల్గొన్నారు.