Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరంగల్ జిల్లాలో పలుచోట్ల భారీ వర్షం
- వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో బుధవారం భారీ వర్షం కురిసింది. వరంగల్ జిల్లా పర్వతగిరి మండలం కల్లెడలో అత్యధికంగా 10.2 సెంటీమీటర్ల వర్షపాతం రికార్డయింది. అదే మండలంలోని ఎనుగల్(9.58 సెంటీమీటర్లు)లో, సంగెం మండల కేంద్రంలో(7.63 సెంటీమీటర్లు), నెక్కొండ మండలం రెడ్లవాడ(6.50 సెంటీమీటర్ల)లో భారీ వర్షం కురిసింది. సూర్యాపేట, ఖమ్మం, భద్రాద్రికొత్తగూడెం, ములుగు, నల్లగొండ, సిద్దిపేట, యాదాద్రిభువనగిరి, మహబూబాబాద్, జనగాం జిల్లాల్లో పలుప్రాంతాల్లో మోస్తరు వర్షపాతం నమోదైంది. రాష్ట్రంలో 155 రెయిన్‌గేజ్ సెంటర్ల పరిధిలోని ప్రాంతాల్లో వర్షం కురిసింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వచ్చే మూడ్రోజులు తేలికపాటి నుంచి మోస్తరు వానలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అక్కడక్కడా ఉరుములు, మెరుపులు, వడగండ్లతో కూడిన వర్షాలు కూడా పడే అవకాశం ఉంది. దక్షిణ ఇంటీరియల్ కర్నాటక నుంచి రాయలసీమ, తెలంగాణ మీదుగా దక్షిణ చత్తీస్‌గఢ్ వరకు సముద్ర మట్టం నుంచి 0.9 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ద్రోణి కొనసాగుతున్నది.