Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కంది
సంగారెడ్డి జిల్లా కంది మండలంలోని ఐఐటీ హైదరాబాద్‌లో కరోనా కలకలం సృష్టించింది. ఒకేసారి 119 మందికి పాజిటివ్‌గా నిర్ధారణైంది. వీరిలో అధ్యాపకులతో పాటు విద్యార్థులూ ఉన్నారు. ఈ విషయమై ఐఐటీ పీఆర్డీ మిథాలి అగర్వాల్‌ను వివరణ కోరగా.. విద్యార్థులతోపాటు కొంతమంది సిబ్బందికి పాజిటివ్ వచ్చినా.. వారికి స్వల్ప లక్షణాలే ఉన్నాయన్నారు. క్యాంపస్‌లో ఆస్పత్రి ఉందని, డాక్టర్లతో మెరుగైన వైద్యం అందిస్తున్నామన్నారు. విద్యార్థులను ఎవరి గదుల్లో వారిని ప్రత్యేకంగా ఐసొలేషన్‌లో ఉంచామన్నారు. ఎవరూ ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. నెగెటివ్ రిపోర్ట్ రాగానే వివరాలు తెలియజేస్తామన్నారు. కాగా ఐఐటీలో మొత్తం 250 మంది ఫ్యాకల్టీ పనిచేస్తుండగా, దాదాపు 2000వేల మందికి పైగా విద్యార్థులు ఉన్నారు.