Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్కారుకు టీడబ్ల్యూజేఎఫ్ విజ్ఞప్తి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
కరోనా కల్లోల సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా విధులు నిర్వహిస్తూ...సమాజహితం కోసం పాటుపడుతున్న జర్నలిస్టులను ఫ్రంట్లైన్ వారియర్లుగా గుర్తించి బూస్టర్ డోస్ వ్యాక్సిన్ ఇవ్వాలని తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్(టీడబ్ల్యూజేఎఫ్) ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షులు ఎం. సోమయ్య, ప్రధానకార్యదర్శి బి.బసవపున్నయ్య బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. విధి నిర్వహణలో ఎంతో మంది జర్నలిస్టులు కరోనాకు బలయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రిడిటేషన్ కార్డు తో సంబంధం లేకుండా జర్నలిస్టులందరికీ బూస్టర్ డోస్ ఇవ్వాలని సూచించారు. వారు రాష్ట్రవ్యాప్తంగా వైరస్ విస్తరణను దష్టిలో పెట్టుకుని, దాదాపు లక్ష మంది వరకు జర్నలిస్టులు, వారి కుటుంబాలకు బూస్టర్ డోస్ వ్యాక్సిన్ పంపిణీ చేసేలా వెంటనే చర్యలు ప్రారంభించాలని కోరారు.