Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వైద్యారోగ్యశాఖ నివేదిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
దేశంలో కరోనా పరిస్థితులపై గురువారం ప్రధానమంత్రి, రాష్ట్రాల ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్యారోగ్యశాఖ నివేదిక సిద్ధం చేసింది. రాష్ట్రంలో ఒమిక్రాన్ ప్రవేశించిన తర్వాత కరోనా పరిస్థితి, రోజువారీ టెస్టులు, పాజిటివిటీ రేటు, వ్యాక్సినేషన్ కార్యక్రమంతో పాటు థర్డ్ వేవ్‌ను ఎదుర్కొనేందుకు ఆస్పత్రుల్లో ఏర్పాట్లుతో నివేదికను రూపొందించారు. ప్రభుత్వ, ప్రయివేటు ఆస్పత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటు ఏ దశలో ఉన్నాయనే విషయాలను కూడా అందులో పొందుపరిచారు. ఈ నివేదికను ఇప్పటికే రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు సీఎం కేసీఆర్ కు అందజేసింది.