Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : వివిధ రంగాల్లోని ప్రముఖులకు ఇచ్చే పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ కీర్తి పురస్కారాలను బుధవారం అందచేశారు. తెలుగు యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా కార్టూనిస్ట్ జావేద్ అందుకున్నారు. తెలుగు యూనివర్సిటీ ఉపాధ్యక్షులు ఆచార్య కిషన్ రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు పురస్కార గ్రహీతలతో పాటు తెలంగాణ అకాడమీ అధ్యక్షుడు జూలూరి గౌరీశంకర్ పాల్గొన్నారు.