Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే
నవతెలంగాణ-సిటీబ్యూరో
మహిళల్లో ఉన్న కళలను వెలికితీసేవి సంక్రాంతి ముగ్గులు అని ఐద్వా జాతీయ ప్రధాన కార్యదర్శి మరియం ధావలే అన్నారు. హైదరాబాద్ సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో పలుచోట్ల నిర్వహించిన ముగ్గుల పోటీలకు హాజరైన ఆమె ప్రసంగించారు. మహిళల్లో ఉత్సాహాన్ని నింపేందుకు సంక్రాంతి సందర్భంగా ఐద్వా ఆధ్వర్యంలో ముగ్గులు, ఆటల పోటీలను నిర్వహించినట్టు తెలిపారు. మహిళలు ఇంటా బయటా పనిచేస్తూ అనునిత్యం కష్టపడుతూ అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, ప్రభుత్వాలు ఈ సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని అన్నారు. దేశంలో 56 శాతం మహిళలు పేదరికం కారణంగా రక్తహీనతతో బాధపడుతున్నారన్నారు. అధిక ధరలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని చెప్పారు. సంక్రాంతి పండుగ సందర్భంగా రంగులతో వేసిన ముగ్గుల లాగా మహిళల జీవితాలు కూడా కలర్ఫుల్గా సుఖశాంతులతో ఉండాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు ఆర్.అరుణజ్యోతి, హైదరాబాద్ సెంట్రల్ సిటీ అధ్యక్ష, కార్యదర్సులు ఎ.పద్మ, కె.నాగలక్మి, నగర నాయకులు షాబాన, వరలక్మి, ప్రవళిక, లావణ్య, జానకి, సౌత్‌జోన్ కార్యదర్శి శశికళ పాల్గొన్నారు.