Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తెలంగాణ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘం
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
భవిష్యత్తులో సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టనున్నట్టు తెలంగాణ చెవి.ముక్కు, గొంతు వైద్యుల సంఘం తెలిపింది. అఖిల భారత చెవి, ముక్కు గొంతు వైద్యుల సమాఖ్య, తెలంగాణ చెవి, ముక్కు, గొంతు వైద్యుల సంఘాన్ని అత్యుత్తమ వైద్య, విద్య, సాంఘిక సేవలందించే సంఘంగా ప్రథమ స్థానంలో గుర్తించింది. ఈ నేపథ్యంలో బుధవారం కోఠిలోని ఈఎన్టీ ఆస్పత్రిలో జరిగిన సదస్సులో ఆ ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ శంకర్, సమాఖ్య అధ్యక్షులు డాక్టర్ సుదీప్, కోశాధికారి డాక్టర్ హమీద్, పూర్వ అధ్యక్షులు డాక్టర్ సతీష్, జాతీయ జీవన సాఫల్య బహుమతి గ్రహీత డాక్టర్ ద్వారకనాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.