Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- క్యాలెండర్ ఆవిష్కరణలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రిటైర్డ్ గెజిటెడ్ అధికారులు తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించారని, వారి సేవలు మరువలేనివని మంత్రి వి శ్రీనివాస్‌గౌడ్ అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను అమలు చేయడంలో పింఛనర్లు సహకరించాలని కోరారు. వారికి సంబంధించి ప్రత్యేక డైరెక్టరేట్ ఏర్పాటు అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని హమీ ఇచ్చారు. తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం రూపొందించిన వెబ్సైట్, పింఛనర్ల హ్యాండ్‌బుక్, నూతన సంవత్సర క్యాలెండర్‌ను బుధవారం హైదరాబాద్‌లో మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పింఛనర్ల సమస్యలు తనకు తెలుసుననీ, వారికి రావాల్సిన డీఆర్‌లను విడుదల చేసేందుకు కృషి చేస్తామని చెప్పారు. ఉద్యోగుల ఆరోగ్యపథకం పకడ్బందీగా అమలుచేయడానికి ఒక శాతం బేసిక్ పింఛన్లో మినహాయించుకుని నగదు రహిత ఆరోగ్య చికిత్సను అన్ని కార్పొరేట్ ఆస్పత్రుల్లో అమలుచేయడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రిటైర్డ్ గెజిటెడ్ అధికారుల సంఘం అధ్యక్షులు ఎం మోహన్ నారాయణ, ప్రధాన కార్యదర్శి ఎస్ నర్సరాజు, నాయకులు జె రవీందర్, కె యాదయ్యగౌడ్, జి విష్ణువర్ధన్‌రావు, కె దశరథరావు, కె బ్రహ్మానందం, పులి ప్రభాకర్, పుట్ట పాండురంగయ్య, చంద్రమౌలి, సుదర్శన్‌రెడ్డి, పి సత్తయ్య, పివి సత్యనారాయణ, జయభారతి తదితరులు పాల్గొన్నారు.