Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భవన నిర్మాణ కార్మికుల డైరీ ఆవిష్కరణలో మంత్రి మల్లారెడ్డి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
భవన నిర్మాణ కార్మికులంతా వెల్ఫేర్బోర్డులో చేరి సంక్షేమ పథకాలను ఉపయోగించుకోవాలని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి సూచించారు. బుధవారం హైదరాబాద్లో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం(సీఐటీయూ-సీడబ్ల్యూఎఫ్ఐ అనుబంధం) 2022 డైరీని మంత్రి మల్లారెడ్డి ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. భవన నిర్మాణ సంఘం ముద్రించిన డైరీలో కార్మికులు బోర్డులో చేరేందుకు, నష్టపరిహారాలు పొందేందుకు కావాల్సిన సమాచారం, జీఓలు, అధికారుల ఫోన్నెంబర్లను పొందుపర్చటం బాగుందని కొనియాడారు. కార్మికులంతా ఈ డైరీలోని సమాచారాన్ని ఉపయోగిం చుకోవాలని సూచించారు. ఈ డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో తెలంగాణ భవన, ఇతర నిర్మాణ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు వంగూరు రాములు, ప్రధాన కార్యదర్శి ఆర్.కోటంరాజు, కార్యదర్శి కందుల జంగయ్య తదితరులు పాల్గొన్నారు.