Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆ పార్టీవి రైతు వ్యతిరేక విధానాలు
- రైతులను వారి పొలాల్లోనే కూలీలుగా మార్చే కుట్ర
- బీజేపీ వ్యతిరేక పోరాటంలో కలిసి రావాలంటూ సీఎం కేసీఆర్ పిలుపు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వ్యవసాయం, దాని అనుబంధ రంగాలు, వృత్తులను నిర్వీర్యం చేస్తున్న బీజేపీ ప్రభుత్వాన్ని, ఆ పార్టీని కూకటి వేళ్లతో పెకిలించాలని ముఖ్యమంత్రి కేసీఆర్... ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా నిర్వహించబోయే పోరాటంలో కలిసి రావాలని విజ్ఞప్తి చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేయటం ద్వారా వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకు ఆ పార్టీ కుట్రలు పన్నుతున్నదని ఆయన హెచ్చరించారు. వ్యవసాయాన్ని కుదేలు చేసేందుకు, రైతాంగం నడ్డివిరిచేందుకు వీలుగా ఎరువుల ధరలను పెంచుతూ కేంద్రం నిర్ణయించటం పట్ల సీఎం తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన బుధవారం ఒక ప్రకటన విడుదల చేశారు. '2022 నాటికల్లా రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామంటూ కేంద్రం గొప్పలు చెప్పింది. కానీ ఎరువుల ధరలను విపరీతంగా పెంచటం ద్వారా వారి నడ్డి విరిచింది. తాను చెప్పిన మాటలకు భిన్నంగా వ్యవసాయ ఖర్చులను రెట్టింపు చేయడం దుర్మార్గం. దీంతో బీజేపీ ప్రభుత్వం పచ్చి రైతు వ్యతిరేకమైందనే విషయం అర్థమైంది. రైతులను అది బతకనిచ్చేలా లేదు. కరెంటు మోటార్లకు మీటర్లు బిగించి బిల్లులు వసూలు చేయడం... ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయటంపై నాన్చుడు ధోరణిని అనుసరించటం, ఎరువుల ధరలను పెంచడం, రైతులు తాము పండించిన ధాన్యాన్ని కూడా అమ్ముకోనీయకుండా అడ్డుకోవటం... తదితర చర్యల వెనుక కుట్ర దాగుంది...' అని కేసీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. బీజేపీ చర్యల వల్ల రైతులు వారి పొలాల్లోనే కూలీలుగా మారబోతున్నారని కేసీఆర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. ఇలాంటి చర్యలను ఎదుర్కోవాలని సూచించారు. దశాబ్దాలుగా కొనసాగుతున్న ఎరువుల సబ్సిడీలను ఎత్తేయటం ద్వారా రైతులను వ్యవసాయం నుంచి దూరం చేసేందుకు మోడీ సర్కార్ కుయుక్తులు పన్నుతున్నదని ఆయన తెలిపారు. ఈ క్రమంలో దేశ రైతాంగం నాగండ్లు ఎత్తి తిరగబడితే తప్ప వ్యవసాయాన్ని కాపాడుకోలేమని తెలిపారు. అందువల్ల కేంద్రానికి బుద్దొచ్చే దాకా ఎక్కడికక్కడ నిలదీయాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
ఎరువుల ధరలను యధాతథంగా ఉంచండి..
వాటిని పెంచితే రైతుకు మరింత భారం...: ప్రధాని మోడీకి సీఎం కేసీఆర్ లేఖ
పెంచిన ఎరువుల ధరలను యధాతథంగా ఉంచాలనీ, వాటిని ఎంతమాత్రమూ పెంచొద్దని సీఎం కేసీఆర్... కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు ఆయన ప్రధాని మోడీకి బుధ వారం బహిరంగ లేఖ రాశారు. దేశం లోని కోట్లాది మంది రైతుల తరఫున తాను ఈ లేఖను రాస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. రైతాంగం తీవ్ర ఇబ్బం దుల్లో ఉన్న ప్రస్తుత నేపథ్యంలో ఎరు వుల ధరలను 50 శాతం నుంచి వంద పెంచటంతో వారిపై మరిన్ని భారాలు పడతాయని హెచ్చరిం చారు. కేంద్రం గుడ్డిగా ఎరువుల ధర లను పెంచుతూ పోతోందని ఆందో ళన వ్యక్తం చేశారు. ఎరువులపై సబ్సి డీలను ఇవ్వటం ద్వారా రైతుకు పెట్టు బడికయ్యే ఖర్చును తగ్గించాలని కోరా రు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసా యంతో అనుసంధానం చేయాలని కోరుతూ తెలంగాణ అసెంబ్లీ తీర్మా నం చేసి పంపినా కేంద్రం పట్టించుకో లేదని ఆ లేఖలో పేర్కొన్నారు.