Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ఒంటెలను వధించకుండా చర్యలు తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వాటిని తిరిగి సురక్షితంగా రాజస్థాన్‌కు తరలించి, అక్కడి ప్రభుత్వానికి అప్పగించాలని స్పష్టం చేసింది. ఒంటెల రక్షణకు సంబంధించి గతంలో కూడా ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీచేసిందనీ, వాటిని అమలు చేసి తీరాలని ప్రధాన న్యాయమూర్తి సతీష్ చంద్రశర్మ, తుకారాంజీలతో కూడిన డివిజన్ బెంచ్ ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఇటీవల తీర్పునిచ్చింది. ఒంటెలను రాజస్థాన్ నుంచి అక్రమంగా రాష్ట్రానికి తరలించి వధిస్తున్నారనీ, చట్టవిరుద్దంగా వీటి వధింపును అరికట్టాలని అభ్యర్థిస్తూ డాక్టర్ కె.శశికళ ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. వాటి అక్రమ రవాణా, వధించడం కూడా జరుగుతోందని ఆమె తన వ్యాజ్యంలో పేర్కొన్నారు.