Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 24వేల కోట్ల చెరుకు రైతుల బకాయిలు ఎప్పుడిస్తారు?
- ఎమ్ఎస్పీ పెంచకుండా కేంద్రం నిర్లక్ష్యం ొ టన్నుకు రూ 5వేల ధర చెల్లించాలి
- చెరుకు రైతుల ఆత్మహత్యలు ఆందోళనకరం ొ సహకార వ్యవస్థను బలోపేతం చేయాలి : ఏఐఎస్ఎఫ్సీసీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రవీంద్రన్, ఎన్కే శుక్లా డిమాండ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక చెరుకు రైతుల సమస్యలను పట్టించుకోవడం లేదని అఖిల భారత షుగర్కేన్ ఫార్మర్స్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐఎస్ఎఫ్సీసీ) జాతీయ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు డి రవీంద్రన్, ఎన్కే శుక్లా విమర్శించారు. దేశ వ్యాప్తంగా చెరుకు రైతులకు కేంద్ర ప్రభుత్వం రూ 24వేల కోట్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని చెప్పారు. బకాయిల విష యంలో కేంద్ర మంత్రులు ఇచ్చినట్టు ప్రకటనలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని వెంటనే విడుదలచేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే పార్లమెంటును ముట్టడిస్తామని హెచ్చరిం చారు. అఖిలభారత షుగర్కేన్ ఫార్మర్స్ కోఆర్డినేషన్ కమిటీ (ఏఐఎస్ఎఫ్సీసీ) జాతీయ సమావేశాలను పురస్కరించుకుని బుధవారం హైదరాబాద్లోని సుంద రయ్య విజ్ఞానకేంద్రంలో ఆసంఘం కోశాధికారి విజ్జుకృష్ణన్, జాతీయ నాయకులు సారంపల్లి మల్లారెడ్డి, కృష్ణ ప్రసాద్, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్, సహాయ కార్యదర్శి మూడ్ శోభన్తో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు.
ఐదారేండ్లుగా చెరుకు మద్దతు ధర పెంచకుం డా కేంద్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తున్నదని విమర్శించారు. పెరుగుతున్న పెట్టుబడి ఖర్చులతో రైతులు ఇబ్బందులు పడుతున్నారనీ, అనేక చోట్ల చెరుకు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పంజాబ్, హర్యానా వంటి రాష్ట్రాల్లో క్వింటా చెరుకు రూ 300 నుంచి రూ.360 వరకు మాత్రమే ఇస్తున్నారని వివరించారు. రైతు లకు 14 రోజుల్లో చెరుకు బకాయిలు చెల్లించాలనే నిబంధన ఉందనీ, బీజేపీ ప్రభుత్వం దాన్ని తుంగలో తొక్కిందని విమ ర్శించారు. బకాయిలు మొత్తం చెల్లించినట్టు కేంద్ర మం త్రులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని తెలిపారు. సకాలంలో ఇవ్వకపోతే వడ్డీతోసహా బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశ వ్యాప్తంగా 12రాష్ట్రాల్లో చెరుకు సాగవుతుందని తెలిపారు. మద్దతు ధర మాత్రం ఏడాదికి రూ 50లు పెం చిందని చెప్పారు. సహకార సంఘాలను నిర్వీర్యం చేస్తూ...ప్రయివేటు చక్కర కర్మాగారాలకు అనుమతి ఇస్తున్న దని విమర్శించారు. ఇప్పటికే విజయవాడలో కొత్త కంపెనీకి అనుమతి ఇచ్చారని తెలిపారు. విజ్జుకృష్ణన్ మాట్లాడుతూ దేశంలో చెరుకు రైతులు సంక్షోభంలో ఉన్నారని చెప్పారు. రైతుల సమస్య కోసం పెద్ద ఎత్తున్న పోరాటాలు నిర్వహిస్తా మన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 30 చెరుకు ఫ్యాక్టరీలుంటే, అం దులో ఐదు మాత్రమే పని చేస్తున్నాయనీ, మిగతావి మూత పడ్డాయని చెప్పారు.
చెరుకు రంగంలోకి ప్రయివేటు కంపెనీ లకు బీజేపీ సర్కారు ద్వారాలు తెరించిందనీ, అందుకనుగు ణంగానే కృష్ణా జిల్లాలో చెరుకు ప్యాక్టరీ నిర్మించేందుకు టయోట కంపెనీకి అప్పగించిందని విమర్శించారు. చెరుకు రైతులకు బ్యాంకులు రుణాలు కూడా ఇవ్వడం లేదనీ, అం దుకే ప్రయివేటు వడ్డీ వ్యాపారులను ఆశ్రయిస్తున్నారని తెలం గాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి సాగర్ ఆవే దన వ్యక్తం చేశారు. చెరుకు అమ్మిన తర్వాత బెల్లం, చక్కర, మెలాసిస్ తయారు చేసి, ఆయా కంపెనీలు లాభాలు గడిస్తు న్నాయి కానీ రైతులకు బకాయిలు చెల్లించడం లేదని విమ ర్శించారు. చెరుకు రైతుల సమస్యలను పరిష్కరించకపోతే ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు.