Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రిజర్వేషన్లను తుంగలో తొక్కే కుట్ర
- మంత్రి శ్రీనివాస్‌గౌడ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కేంద్రంలోని బీజేపీ విధానాలను చూస్తుంటే.. ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రయివేటు పరం చేసే ప్రమాదం పొంచి ఉందని రాష్ట్ర మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ ఆందోళన వ్యక్తం చేశారు. తద్వారా రిజర్వేషన్లను తుంగలో తొక్కేందుకు మోడీ సర్కారు ప్రయత్నిస్తున్నదని విమర్శించారు. గురువారం హైదరాబాద్‌లోని టీఆర్ఎస్ శాసనసభాపక్ష కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాజీ మంత్రి సి.లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే గణేశ్ గుప్తాతో కలిసి ఆయన మాట్లాడారు. ఎరువుల ధరలను పెంచటం, కరెంటు మోటార్లకు మీటర్లు బిగించాలనటం తదితర చర్యల ద్వారా రైతాంగం నడ్డి విరిచేందుకు కేంద్రం కుట్రలు పన్నుతున్నదని ఆయన విమర్శించారు. బీజేపీకి దిశా నిర్దేశం చేసే ఆరెస్సెస్ ఎరువుల ధరలను పెంచాలంటూ చెప్పిందా..? అని ప్రశ్నించారు. ఆ పార్టీకి చెందిన కిసాన్ మోర్చా రైతులను నట్టేట ముంచాలంటూ సూచించిందా..? అని అన్నారు. పీఎం కిసాన్ నిధికి మోడీ సర్కార్ సవాలక్ష నిబంధనలను విధించిందని విమర్శించారు. ఇలాంటి వాస్తవాలన్నింటినీ విస్మరించిన బీజేపీ నేతలు.. సీఎం కేసీఆర్‌ను జైల్లో పెడతామంటూ పదే పదే బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. 'కేసీఆర్‌ను టచ్ చేసి చూడండి... తెలంగాణ అంటే ఏంటో చూపెడతాం...' అంటూ శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు.