Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విద్యాశాఖ కార్యదర్శికి
టీఎస్‌జీసీసీఎల్‌ఏ లేఖ
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో రెగ్యులర్ లెక్చరర్ల బదిలీల వల్ల ఉద్యోగాలు కోల్పోయిన కాంట్రాక్టు అధ్యాపకులకు న్యాయం చేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కాలేజీల కాంట్రాక్టు లెక్చరర్ల సంఘం (టీఎస్‌జీసీసీఎల్‌ఏ-475) డిమాండ్ చేసింది. వారిని తిరిగి నియమించాలని కోరింది. ఈ మేరకు విద్యాశాఖ కార్యదర్శి సందీప్‌కుమార్ సుల్తానియాకు గురువారం టీఎస్‌జీసీసీఎల్‌ఏ అధ్యక్షులు జి రమణారెడ్డి, ప్రధాన కార్యదర్శి కొప్పిశెట్టి సురేష్ ఆన్లైన్ ద్వారా వినతిపత్రం పంపించారు. ప్రభుత్వం విడుదల చేసిన 317 జీవో వల్ల ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో రెగ్యులర్ లెక్చరర్లు మల్టీ జోన్-1 నుంచి 2కు, మల్టీ జోన్-2 నుంచి 1కు బదిలీలయ్యాయని వివరించారు. అక్కడ పనిచేస్తున్న కాంట్రాక్టు అధ్యాపకులు ప్రస్తుతం ఉద్యోగాలు కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. వారికి ఆన్లైన్ కౌన్సెలింగ్ నిర్వహించి ఖాళీగా ఉన్న అన్ని పోస్టులనూ చూపి వారి సొంత జిల్లాలకు, సొంత జోన్లకు వెళ్లే అవకాశం కల్పించాలని కోరారు. స్పౌజ్, మెడికల్, పరస్పర బదిలీలకు అవకాశం కల్పించాలని సూచించారు. ఇంటర్ విద్యా కమిషనర్, ఆర్జేడీ వరంగల్‌కు వినతిపత్రం పంపించామని వివరించారు